Thursday, May 2, 2024

చరిత్ర సృష్టించిన నొవాక్‌ జకోవిచ్‌..!!

spot_img

Novak Djokovic : సెర్బియన్‌ టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ -2023మెన్స్‌ సింగిల్‌ విజేతగా నిలిచాడు.  కెరీర్‌లో 24వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే అత్యధిక టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా జకోవిచ్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Also Read.. ప్రపంచంలో అతిలోతైన గుహలోకి వెళ్లిన వ్యక్తి సేఫ్..!!

తాజాగా న్యూయార్క్‌లోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌(మూడో సీడ్‌)ను ఓడించి 24వ గ్రాండ్‌ స్లామ్‌ను నొవాక్‌ గెలుపొందారు. ఫైనల్‌ పోరులో 6-3, 7-6, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసాడు. మొత్తంగా టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్‌ కోర్ట్‌ (24) ను జకోవిచ్‌ సమం చేశాడు.

Latest News

More Articles