Saturday, May 4, 2024

తెలంగాణ పరువు తీస్తున్నారు.. సీఎం రేవంత్ పై అక్బరుద్ధీన్ నిప్పులు

spot_img

హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువు తీస్తున్నదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల పాలైందన్న సంకేతాలను బయటకు పంపడం ద్వారా రేపటి రోజున పరిశ్రమలు, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని ఫైర్ అయ్యాడు. ఇలాంటి నివేదికలతో సభను తప్పుదోవ పట్టించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీస్తున్నారని మండిపడ్డారు.

Also Read.. ఈఎంఐ కట్టలేని దుస్థితి.. ఆటో డ్రైవర్ల తీవ్ర ఆవేదన

అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. ఆర్బీఐ, కాగ్, అసెంబ్లీ బడ్జెట్ నివేదికలను ఇష్టానుసారంగా ఏకపక్షంగా వినియోగించారని విమర్శించారు. గత 10 ఏండ్లు పాలించిన ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే ఆదరాబాదరగా శ్వేతపత్రాన్ని తయారు చేయించినట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు. ఇంకా సమయం తీసుకొని సరైన లెక్కలతో సభ ముందు నివేదిక తయారు చేయాల్సిందని సూచించారు.

Latest News

More Articles