Friday, May 10, 2024

ఈఎంఐ కట్టలేని దుస్థితి.. ఆటో డ్రైవర్ల తీవ్ర ఆవేదన

spot_img

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. బుధవారం కాగజ్‌నగర్‌లో ఆటోలతో ర్యాలీ తీశారు. పట్టణంలోని లారీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫైనాన్స్‌లో కొన్న ఆటోలకు నెలనెలా ఈఎంఐ కట్టలేని దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, ప్రతినెలా జీవన భృతి రూ.10వేలు, ప్రతి ఆటో డ్రైవర్‌కు జీవిత బీమా 5లక్షల పాలసీ సౌకర్యం కల్పించాలని కోరారు. సర్కారు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Latest News

More Articles