Sunday, May 19, 2024

లేనిపోనీ కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు వీఆర్ఏలు బుద్ధి చెప్పాలి

spot_img

ఒకనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే గుర్తింపు ఉండేది, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే గౌరవం ఎక్కువ దక్కుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్‎లో వీఆర్ఏలకు నియామక ఉత్తర్వులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పులాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జమున, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సిద్ధిలింగం, కలెక్టర్ శివలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘తాజాగా వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల 500 మంది, జనగామ జిల్లాలో 314 మంది వీఆర్ఏలకు లబ్ది చేకూరింది. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలన చూశాం, ఇప్పుడు కేసీఆర్ పాలన చూస్తున్నాం. అప్పట్లో పట్వారీ వ్యవస్థ ఏది చెప్తే అదే ఉండేది, పట్వారీలు పటేండ్లుగా పెత్తనం చేసేవారు. ఎన్టీఆర్ పట్వారీ వ్యవస్థను తీసేసి వీఆర్ఏలను చేస్తే, మన మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఒకనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తేనే గుర్తింపు ఉండేది, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే గౌరవం ఎక్కువ దక్కుతోంది. సీఎం కేసీఆర్‎కి గోరి కడతాం అని పిచ్చి కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీనాయకులకు ప్రజలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎప్పుడో గోరి కట్టారు. లేని పోనీ కూతలు కూస్తున్న ప్రతిపక్షాలకు వీఆర్ఏలు బుద్ధి చెప్పాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Latest News

More Articles