Sunday, May 19, 2024

స్త్రీ, శిశు సంక్షేమంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం

spot_img

మహబూబాబాద్ జిల్లా : తొర్రుర్ మండలంలోని రామ ఉపేందర్ గార్డెన్స్ లో ఏర్పాటు  చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళ సంక్షేమ దినోత్సవంలో ముఖ్య అతిధిగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. వరంగల్ ఎంపి పసునూరి దయాకర్,వరంగల్ కలెక్టర్ ప్రాణిక్య వీణ, మహబూబాబాద్ జిల్లా ఆడిషినల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..  స్త్రీ, శిశు సంక్షేమంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అన్నారు. గర్భిణీలకు, బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనేదే తెలంగాణ సర్కార్ లక్ష్యం అని స్పష్టం చేశారు.  తెలంగాణ రాష్ట్ర పథకాలపై కేంద్రం ప్రశంసలు కురిపిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మి మహిళల భద్రత చర్యలు , కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు దేశానికే  ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.

Latest News

More Articles