Tuesday, May 7, 2024

పూర్తి మహిళ భద్రత కోసం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్

spot_img

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ సిపి డీఎస్ చౌహన్ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న కృషిని వివరించారు. మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమాలపై డీఎస్ చౌహన్ స్పందిస్తూ.. రాత్రి, పగలు డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా టీంకి ధన్యవాదాలు.

మహిళ భద్రత, కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అమోఘం. దానికి రాచకొండ కమిషనరేట్ మా పూర్తి బాధ్యత తీసుకుంది. మహిళల పట్ల షీ టీం ఉమెన్స్ సేఫ్టీ కోసం ఎక్కువగా వారిలో అవెర్న్స్ తీసుకోవాలని సూచించారు. రాచకొండ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ను పూర్తిగా మహిళ భద్రతకు కోసమే ఈ రోజు తీసుకోవరావడం జరిగింది. హెల్ప్ లైన్ కి వచ్చిన కాల్ కి 24 గంటల్లో పరిస్కారం చేస్తామని తెలిపారు సిపి డీఎస్ చౌహన్.

Latest News

More Articles