Saturday, May 18, 2024

విదేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది

spot_img

జనగామ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జనగామ జిల్లాకేంద్రంలోని ఎన్.ఎమ్.ఆర్ గార్డెన్స్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఇందులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జమున, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, ప్రఫుల్ దేశాయ్, మార్కెట్ ఛైర్మెన్ సిద్ధిలింగం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ముదిరాజ్ లు 20 ఏండ్ల కింద చెరువు కట్టల మీద చేసుకున్న పండుగలు మళ్ళీ ఇప్పుడు చేసుకుంటండ్రు. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు చూస్తున్న. దేశంలో నీటి వనరులు తగ్గిపోతుంటే తెలంగాణలో మాత్రం నీటి లేవల్ పెరిగిపోతుంది ఇది కేసీఆర్ పుణ్యమే అని అన్నారు.

ఒకప్పుడు జనగామ ఎడారి లా ఉండేది, ఇప్పుడు చెక్ డ్యాంలు కట్టడంతో జలకల కనిపిస్తుంది. ముదిరాజ్ లు ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ 350 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణి చేశారు.  చేపలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు.

Latest News

More Articles