Saturday, May 18, 2024

అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. తెలంగాణను సీఎం కేసీఆర్ చేతిలో పెట్టాలి

spot_img

కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ కు ఒక విధానం అంటూ ఏమీ లేదు అది రాష్ట్రానికి ఒక తీరుగా మారుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వేరే రాష్ట్రాల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేసిన కర్ణాటక చత్తీస్గడ్ ప్రజలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మితే గోసపడక తప్పదని హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ లో మీడియాతో మంత్రి గంగుల మాట్లాడారు.

Also Read.. 23 రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు

‘‘దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రెండు పంటలను కొంటున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో సమస్యలు ఎక్కడైనా కనిపించాయా. తెలంగాణను ఆంధ్రాలో బలవంతంగా కలిపింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా. తెలంగాణ కోసం జరిగిన ఆత్మ బలిదానాలకు కారణం మీరు కాదా. తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం మీరు కాదా. వరద కాలువ పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది.

తెలంగాణను ఆంధ్రాలో కలిపింది మీరే… వెనుకబాటు తనానికి కారణం మీరే. కెసిఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. కుటుంబ పాలన అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాకమందు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే… స్వయం పాలనలో కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం.

Also Read.. దసరా పండగ రోజు ఊరూరా చర్చ పెట్టండి.. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడైనా జరిగిందా?

ధరణితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయి. 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనను చూసాం. ఇప్పుడు కర్ణాటక ఛత్తీస్గడ్ రాజస్థాన్ లో చూస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులను కొట్టే పరిస్థితి వచ్చింది. కర్ణాటక వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ముఖం చాటేశారు.

తప్పు చేయొద్దు భవిష్యత్ తరాల బంగారు భవిష్యత్తును అంధకారం చేయవద్దు. కాంగ్రెస్ పాలనలో ఘర్షణలు తప్ప అభివృద్ధి ఉండదు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే తెలంగాణను సీఎం కేసీఆర్ చేతిలో పెట్టాలి. కాంగ్రెస్ బిజెపి హటావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగుదాం.’’ అని మంత్రి గంగుల పిలుపునిచ్చారు.

Latest News

More Articles