Tuesday, May 21, 2024

9 ఏళ్లలో నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

spot_img

కరీంనగర్ జిల్లా: 9 ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, నిరుపేదల జీవితాలలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.

‘‘1969 నుండి 2014 వరకు తెలంగాణ పోరాటం కొనసాగిందని.. తెలంగాణ ఆకాంక్షలో న్యాయం ఉంది కనుకనే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం. సమైక్య పాలనలో నిరుపేదల జీవితాలు మారలేదని… సమైక్య పాలనలో అప్పటి పాలకులు  తెలంగాణ సంపదను కొల్లగొట్టారు నీళ్లను నిధులు, బొగ్గును దోచుకెళ్లారు.

కుల వృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో..ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. పేదల సంక్షేమం కోసం కేసిఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేదు. తెల్లారితే కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేదల కోసం చేసేది ఏమీ లేదు.

తెలంగాణ లో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. ఒక్కో విద్యార్థికి 1లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తూ న్నామని నాణ్యమైన విద్య,పౌష్ఠిక ఆహారం అందిస్తున్నము. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వడం వల్ల ఎండ కాలంలో ఉండే నీటి బిందల గొడవలు నేడు లేదు. నాడు ఆసరా పింఛన్ కావాలంటే ఇంకొక ఆసరా పింఛన్ లబ్ధిదారుడి చావు కోసం చూడాల్సిన రోజులు ఉండేవని  కాని స్వయం పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాము.’’ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Latest News

More Articles