Tuesday, May 21, 2024

సిద్ధిపేటలో వెటర్నరీ కాలేజీకి శంకుస్థాపన

spot_img

సిద్దిపేటలో పీ.వీ. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. విద్యను సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్నారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‎కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

‘మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారు. మూగజీవాలకు కూడా కేసీఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయి. 1962‎కు ఫోన్ చేస్తే పశు పక్ష్యాదులకు కూడా అంబులెన్స్ సేవలు దక్కుతున్నాయన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారు? 1962 సేవ మనం అందుబాటులోకి తెస్తే.. దాన్ని నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ, రైతుబంధును కూడా నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారు. కేంద్రం తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు ఇస్తది.. అదే కేంద్రం ప్రభుత్వంలోని నాయకులు మాత్రం గల్లీలోకి వచ్చి తిడతారు. కాంగ్రెస్ వాళ్లు పీవీకి ఘాట్ కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఈ వైద్యశాలకు పీవీ పేరు పెట్టి వారి గౌరవాన్ని మరింత పెంచారు. కాళోజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండు ఎండాకాలంలోనూ జలసిరి పెరిగి అలుగు పారుతున్నాయి. సిద్దిపేట జిల్లలో 12,460 మందికి మత్స్య కారులకు కొత్తగా సభ్యత్వం వస్తున్నది. అదేవిధంగా 3.70 లక్షల మందికి రెండో విడత గొర్ల పంపిణీ జరగబోతోంది. సిద్దిపేటకు ఇన్ని సదుపాయాలు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‎కు మనందరం కృతజ్ఞతలు చెప్పాలి’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles