Monday, May 20, 2024

కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ డిమాండ్

spot_img

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు మే 10న సమావేశం కానుంది. కృష్ణా నది బొరుసు ఎజెండాలోని 21 అంశాలతో పాటు తెలంగాణ డిమాండ్స్ పై ఈ సమావేశంలో చర్చకు రానుంది. తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ ల మధ్య 34; 66 నిష్పత్తిలో పంచుకునే ప్రస్తుత పద్ధతిపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ, సమస్యను ఇప్పటివరకు పరిష్కరించలేకపోయింది KRMB. ఈ బోర్డు గత సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 66:34 నిష్పత్తి భాగస్వామ్యాన్ని తాత్కాలిక కేటాయింపును కొనసాగించింది.

ఈ సందర్భంగా జూన్ 1న కొత్త నీటి సంవత్సరం ప్రారంభం కానుండగా.. KRMB రెండు నదీ తీర రాష్ట్రాల నుండి అభిప్రాయాలను కోరింది. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, మైనర్‌ ఇరిగేషన్‌ రంగంలో 45.66 టీఎంసీల మేర తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా వినియోగిస్తున్న విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Latest News

More Articles