Monday, May 20, 2024

కమిట్‎మెంట్ ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే

spot_img

తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. సిద్దిపేటలో పీ.వీ. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.

‘కమిట్‎మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమే. అద్భుతమైన రిజర్వాయర్లు నిర్మించుకున్నాం. గతంలో లక్షా 37 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ 97 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం. నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటానికి నేటి పచ్చని తెలంగాణానే సమాధానం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది, ప్రజలు వాస్తవాలు గుర్తించాలి. గొల్ల – కురుమలు, మత్సకారుల అభివృద్ధిని తెలంగాణలో మనం ఊహించామా? 2014 ముందున్న గోసను నిర్మూలించాం, అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాం. రాష్ట్రంలో 24 గంటల నిరంతారాయ కరెంట్ ఇస్తున్నాం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‎లో కూడా 24 గంటల కరెంట్ లేదు. ఇన్నేళ్ల గత పాలకులు గొల్ల – కురుమలు, రైతులు, మహిళల పాట్లు తీర్చారా? తెలంగాణ ప్రగతి ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదు. వారు కళ్ళున్నా చూడలేని కబోదుల్లా మారారు. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.. త్వరలో మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నాం. ఈ నెల చివరిలో రెండో విడత గొర్ల పంపిణీ కూడా చేపడతాం’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Latest News

More Articles