Monday, May 20, 2024

తడిసిన ధాన్యం కొంటుంటే.. కేంద్రం కొర్రీలు పెడుతుంది..!

spot_img

బాల్కొండ నియోజకవర్గంలో అకాల వర్షానికి నష్టపోయిన పంటలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కేసీఆర్ ఉండగా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వడని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం. ఎకరాకు 10000 ఇచ్చి రైతులకు అండగా నిలుస్తాం. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం కొర్రీలు పెడుతుంది..

ఇక రైతుల ధాన్యాన్ని తీసుకోవడంలో ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వెకిలి చేష్టలు చేస్తుంది. నష్టపోయిన పంటలకు కేసీఆర్ ఎకరానికి 10000 ఇచ్చినట్లు కేంద్రం కూడా 10000 ప్రకటించాలి. అప్పుడే బిజెపి నాయకులు రైతుల పొలాల్లో అడుగు పెట్టాలి’ అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Latest News

More Articles