Sunday, May 19, 2024

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై శుభవార్త

spot_img

సంక్షేమానికి మారుపేరు సీఎం కేసీఆర్. అందుకే తెలంగాణ స్కీమ్స్ దేశంలోనే టాప్ లో ఉంటాయి. ప్రగల్బాలు పలికే బడా ప్రతిపక్ష నేతలు సైతం కేసీఆర్ స్కీమ్స్ ని అభిమానిస్తారు. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే అన్ని వర్గాల ప్రజలు శుభవార్త వింటారని అన్నారు. తెలంగాణలో తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇస్తుందని అన్నారు.

ఆ పార్టీకి 30 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వద్దు అని వదిలేసిన నేతలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటోందని విమర్శించారు. విద్యుత్తు రావడం లేదని కామెంట్స్ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారి కరెంటు ప్లగ్ లో వేలు పెట్టి చూడాలని ఎద్దేవా చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికలకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది.

Latest News

More Articles