Friday, May 17, 2024

ఖమ్మం గడ్డపైనుంచి కాంగ్రెస్ పార్టీ నైజాన్ని బట్టబయలు చేసిన మంత్రి హరీశ్ రావు..!!

spot_img

ఖమ్మం : గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారు కానీ ఆ బిల్లును ఆపలేక పోయారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్ ను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పాలమూరు ప్రజలు సంతోష పడుతుంటే కాంగ్రెస్ వాళ్లకు కడుపు మంటగా ఉందన్నారు. ప్రతి పక్ష పార్టీలు పాలమూరు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Also Read.. వరుడు కావలెను.. నాకు 12 మంది పిల్లలు.. 10 మంది పిల్లల తండ్రి కావాలి

వచ్చే ఎన్నికల్లో నోబుల్స్ కు గోబెల్స్ కు మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు ఎప్పుడైనా నోబుల్స్ ను కోరుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అబద్ధాలనే నమ్ముకుందని, ప్రజలను వంచించడమే ఆపార్టీ నైజమని విమర్శలు చేశారు. భారత దేశంలో లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ఖమ్మం,  కొత్తగూడెం జిల్లాలో కొయ్యగూడెం, గోండుగూడెంలలో విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయని, నిరుపేదలను డాక్టర్లను చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.

Also Read.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 13 జిల్లాలకు అలర్ట్

ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ఇవాళ కరువు పారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో పంజాబ్, హర్యానను తలతన్నెలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసలు కురిపించారు.

కాంగ్రెస్ పార్టీ 50 యేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీత్ ఘఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏమీ చేయలేక పోయారని, అలాంటిది తెలంగాణలో ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మత ఘర్షణలను సృష్టించి అయిన అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే వర్షాకాలం నాటికి కృష్ణా నదిలో నీళ్ళు ఉన్నా లేకున్నా సీతారామ ప్రాజెక్ట్ లో నిండుగా నీళ్ళు ఉంటాయన్నారు. అందుకే కేసీఆర్ కి ఖమ్మం జిల్లా అన్నా , జిల్లా ప్రజలన్న ప్రత్యేకమైన ప్రేమ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Latest News

More Articles