Saturday, May 4, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో 13 జిల్లాలకు అలర్ట్

spot_img

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం కారణంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. అందులో భాగంగా 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Read Also: టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం

అదేవిధంగా హైదరాబాద్‎లో నేడు, రేపు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. దాంతో నగరంలో ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మంగళవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

Latest News

More Articles