Monday, May 13, 2024

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కాక తప్పదు

spot_img

అదిలాబాద్ జిల్లా: కేసిఆర్ అంటే ఒక విశ్వాసం.. కాంగ్రెసోళ్లంటే ఒక నయవంచన అని మంత్రి హరీష్ రావు అన్నారు. రెండు వేల పెన్షన్ 5000 రూపాయలకు పెంచుకోబోతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రతి గడపగడపకు  తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.

Also Read.. ఈటల రాజేందర్ అరాచకాలను గడపగడపకు ప్రచారం చేస్తాం

‘‘రైతుబంధు సృష్టికర్త కేసీఆర్. ఈ దేశంలో రైతుకు డబ్బులు ఇచ్చిన ఓకే నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ కరెంటు బిల్లు వసూలు చేసిండ్రు. నీటి తీరువా పేరు మీద వసూలు చేసింది. కానీ కేసీఆర్ వచ్చినంక నీటి తీరు. కరెంటు బిల్లు లేదు. రైతుకే రైతు బంధు డబ్బులు ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ మాత్రమే.ఈ తాప మల్ల గెలిస్తే ఏకరానికి 16,000 రైతుబంధు అందించబోతున్నాము.

Also Read.. మళ్లీ పెరుగుతున్న ఉల్లిగడ్డ, టమాట ధరలు

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుటిల ప్రయత్నాలతో ఏకమయ్యారు. అదిలాబాదులో సీసీఐని తెరిపించలేని బిజెపి పార్టీ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీకి డిపాజిట్ లేకుండా చేయాలి.కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ వ్యక్తికి టికెట్ అమ్ముకుంది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయి. ఈ రెండు పార్టీలకు డిపాజిట్ లేకుండా చేయాలి.  మరోసారి ఆదిలాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కర్ణాటక కు చెందిన డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విడ్డూరంగా ఉంది.  అక్కడ రైతులను ఆగం పట్టించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ ప్రచారానికి రావడం సిగ్గుచేటు. కర్ణాటకలో రైతులను ఆగం పట్టించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కాక తప్పదు.’’ అని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.

Latest News

More Articles