Wednesday, May 22, 2024

కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ కు ఓటమి తప్పదు. కరెంట్ కావాలంటే కారుకు ఓటెయ్యాలి

spot_img

కొడంగల్: కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ కు ఓటమి తప్పదని, డిసెంబర్ 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీ గెలిచేది ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. కొడంగల్ నియోజవర్గంలోని మద్దూరు వద్ద మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 30 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులే లేరన్నారు. ఈసారి నరేందర్ రెడ్డిని అసెంబ్లీకి పంపిస్తే ప్రమోషన్ ఖాయమని తెలిపారు.

తొమ్మిది సంవత్సరాలలో రేవంత్ తొమ్మిది సార్లు కూడా ఇక్కడకు రాలే. మనకు ఆసరా అయేది ఎవరో చూడండి. కొడంగల్ రూపురేఖలు మార్చిండు నరేందర్ రెడ్డి. తాము గెలవగానే ఆరు గ్యారెంటీ లు పస్ట్ కేబినెట్ లో చేస్తాము అంటున్న ప్రియాంక మరి కర్ణాటకలో ఎందుకు గ్యారెంటీలు అమలు చేయలేదు. 185 రోజులైనా కర్ణాటకలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది రైతుబంధు బంద్ అయింది. 9 గంటల కరెంట్ పోయి ఐదు గంటల కరెంట్ వచ్చింది. రైతు బంధు ఖతం కావాలా..కాంగ్రెస్ ఖతం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.

రేవంత్ ఎన్నడూ ఎవుసం చేయలేదు. 24 గంటల కరెంట్ కావాలి అంటే కేసీఆర్ కు ఓటు వేయాలి. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేసామా అని బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలుష్యం.. కాంగ్రెస్ నాయకుల మాటలు కలుషితం. నాయకులను కొనవచ్చు కానీ కొడంగల్ ఆత్మ గౌరవాన్ని కొన్లేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మరోసారి చరిత్ర పునరావృతం అవుతుందన్నారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ కు వచ్చేది మూడు ప్లేస్. సోనియాను రేవంత్ బలిదేవత అన్నాడు..ఇప్పుడు దేవత అంటున్నాడు. ప్రజల కష్టాలు తెలియని వ్యక్తి రేవంత్. రిస్క్ వద్దు అంటే కారుకు ఓటు వేయాలి. రిస్క్ వద్దు కారు ముద్దు. మద్దూరు మండలం ను మూడు నెలల్లో మునిసిపాలిటీ చేస్తాము. ఇక్కడ పరిశ్రమలు పెడతాము. మద్దూరు పట్టణం లో నాలుగు లైన్లు రోడ్ తొందరలోనే పూర్తి చేస్తాము. సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి సాగునీరు ఇక్కడకు వస్తుందన్నారు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుకు మార్పు కావాలా… సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, యాదాద్రి నీ కట్టినందుకు మార్పు కావాలా. కోటి ఎకరాల మాగానిగా మార్చినందుకు మార్పు కావాలా.. తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే మనం మళ్ళీ వెనక్కి వెళతాము. కాంగ్రెస్ పార్టీది సుతిలేనీ సంసారం. నరేందర్ రెడ్డి గెలవగానే రేషన్ షాపుల్లో సోనా మసూరి బియ్యం ఇస్తాము. సంపద పెంచండి పేదలకు పంచండి అని అంటారు కేసీఆర్. రైతు బంధు మనం ఎకరానికి 16 వేలు అంటే కాంగ్రెస్ వారు మొత్తం సంవత్సరానికి 15 వేలు అంటున్నారు. కొడంగల్ లో 10 వేల డబుల్ బెడ్ రూం లు కట్టిస్తాము. మైనారిటీ లకు కేసీఆర్ 12 వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా. మూడవ తేదీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ వారు ఎవరు ఉండరు. నరేందర్ రెడ్డి మాత్రమే ఉంటారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

Latest News

More Articles