Sunday, May 12, 2024

మీకు సేవ చేయడమే నా బాధ్యత

spot_img

సీఎం కేసీఆర్ రైతు విలువ పెంచడంతో భూమి విలువ పెరిగిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‎ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Read Also: న్యూయార్క్‌‎లో భారీ వరదలు.. ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ‘ఇక్కడ బ్యాంక్ ఏర్పాటుతో మంచి సౌకర్యం అందుతుంది. ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న కొత్తలో రోడ్ లేక అనేక ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు ముండ్రాయిలో నాలుగు వరుసల రోడ్ కూడా రాబోతుంది. మహిళా సంఘాలు లోన్ కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పటి నుండి తిప్పలు లేకుండా డీసీసీబీ బ్యాంక్ ఉపయోగపడుతుంది. మండలానికి ఒక బ్యాంక్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నాం. ఎరువుల బస్తా కోసం కాంగ్రెస్ జమానాలో ఎన్నో కష్టాలు పడ్డాం, చెప్పులు లైన్‎లో పెట్టి ఎదురుచూసేది. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఎరువుల కష్టాలు ఉన్నాయా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. నాట్లు వేయడానికి కూడా మనషులు దొరుకుతలేరు. అంటే అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. రైతు విలువ పెంచింది కేసీఆర్, అందుకే భూమి విలువ పెరిగింది. నీళ్లు లేక ఇబ్బంది పడ్డ రోజుల నుండి నీళ్ళు ఎక్కువయ్యాయి అనే కాడికి వచ్చింది. రైతు బీమా రైతు కుటుంబానికి బాసటగా ఉపయోగపడుతుంది. ఆసరా పెన్షన్‎తో అవ్వ తాతల ఆత్మగౌరవం కేసీఆర్ పెంచిండు. పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి, గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటి వద్ద దింపుతున్నారు. సిద్దిపేట నా కుటుంబం.. మీకు సేవ చేయడమే నా బాధ్యత. ఎవరికి ఏ బాధ వచ్చినా నేను సేవ చేసేందుకు కష్టపడుతా’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles