Saturday, May 11, 2024

మోడీది మాటల్లో దేశభక్తి.. చేతల్లో దేశద్రోహం

spot_img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్‎కి అనుమతులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉచిత విద్యుత్ ప్రతిపక్షాలకు కంటగింపుగా మారిందన్నారు. మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ నాయకులు.. కరెంట్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read Also: మీకు సేవ చేయడమే నా బాధ్యత

రాష్ట్రంలో ఎక్కడా వరి చేను, ఒక్క వరి కంకి కూడా ఎండిపోలేదన్న మంత్రి.. ప్రతిపక్షాలవి అబద్దపు, పసలేని ప్రచారం అని ఎద్దేవా చేశారు. మోడీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా మొండి చేతులే చూపాడన్నారు. ఈ పర్యటనలోనైనా మోడీ.. ఆగిపోయిన యాదాద్రి విద్యుత్ ప్లాంట్‎కు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలనే ఆటంకాలు సృష్టించి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. తొమ్మిది నెలల్లో tor(టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ) ఇవ్వాలన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కేంద్రం బేఖాతర్ చేస్తుందని ఆరోపించారు. నిర్మాణం పూర్తయినా అనుమతులు ఇవ్వడం లేదన్నారు. మోడీ జోక్యం చేసుకుని కేంద్ర మంత్రికి ఆదేశం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మోడీ అడుగు పెట్టే ముందే ఆదేశాలు ఇచ్చి రావాలని డిమాండ్ చేశారు.

Read Also: న్యూయార్క్‌‎లో భారీ వరదలు.. ఎమర్జెన్సీ విధించిన గవర్నర్

మాటల్లో దేశ భక్తి గురించి చెప్పే మోడీ.. చేతల్లో మాత్రం దేశానికి ద్రోహం చేస్తున్నాడని అన్నారు. అభివృద్ధి చెందుతున్న వారికి ప్రోత్సహం ఇవ్వకపోగా.. ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర రైతాంగానికి గుండెకాయగా మారుతుందనే యాదాద్రి ప్లాంట్ పై కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంపై జరుగుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Latest News

More Articles