Sunday, May 19, 2024

బీజేపీ, కాంగ్రెస్ మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది సీఎం కేసీఆర్

spot_img

సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని ప్రధాని మోడీ కాపీ కొట్టారని వైద్యారోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది సీఎం కేసీఆర్ అని అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జ‌డ్పీ చైర్మన్ రోజాశర్మ, తదితర బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: ఎమ్మెల్యే టికెట్ నాకు గడ్డి పోసతో సమానం

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు.  ‘ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి. పేదల పక్షాన పోరాడిన వీర వనిత. ఆమె పోరాటం వల్లనే ఎంతో మందిని కాపాడింది. ఐలమ్మ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పోరాడటం వల్లనే రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో మంది ఉద్యమకారులను గుర్తించి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 500 మంది రజకులకు ఆర్థిక సహాయం అందించాం. 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. కానీ కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ. వారంలోపు రజకుల ఫంక్షన్ హాల్ కోసం స్థలం అప్పగిస్తాం. సిద్దిపేట ఓపెన్ ఏయిర్ ఆడిటోరియంకు చాకలి ఐలమ్మ ఆడిటోరియంగా నామకరణం చేస్తున్నాం’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Read Also: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్

 

Latest News

More Articles