Wednesday, May 8, 2024

ఎందుకు తెలంగాణని పదేపదే అవమానిస్తున్నారు.. కేటీఆర్ తీవ్ర ఆవేదన

spot_img

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఎమ్మెల్సీలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ, గవర్నర్ పై నిప్పులు చెరిగారు. అమృతకాల సమావేశాల్లో మోడీ ఎందుకు తెలంగాణపై విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అనవసర వ్యాఖ్యలు చేశారు. ఎందుకు తెలంగాణ ఏర్పాటును అవమానిస్తున్నారు అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిరోజే తెలంగాణపై విషం చిమ్మారు.

జిల్లాల్లో తెలంగాణ వాటా ఎంతో చెప్పే ఓపిక లేదా ? అమృత్ కాల్ సమావేశాలు అని విషం చిమ్మారు. 811 బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం..575 టీఎంసీలు దక్కాలన్నారు. బీజేపీ న్యాయం చేయకపోవడం వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీటికి ఇబ్బంది కలుగుతుంది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడైనా పాప పరిహారం చేసుకొని ఆ ప్రక్షాళన కోసమైనా స్పందించి.. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి. తట్టెడు మట్టి.. తొట్టెడు నీరు తీసుకొచ్చారు. తెలంగాణలో బీజేపీని ఎవ్వరూ నమ్మరు అని చెప్పారు మంత్రి కేటీఆర్. 110 డిపాజిట్లు గల్లంత్ కావడం ఖాయమన్నారు. తొమ్మిదిన్నరేళ్ల తరువాత పాప పరిహారం చేసుకుంటారని పేర్కొన్నారు.

Latest News

More Articles