Monday, May 20, 2024

 రైతుబంధుపై ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

spot_img

రైతుబంధు అమలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే రైతుబంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆత్మకూరు(ఎస్‌) మండల కేంద్రంలో జగదీశ్ రెడ్డి గడపగడప ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన…సీఎం రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. రైతుబంధుని ఏసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశాడన్నారు. రైతుల విషయంలో బీఆర్‌ఎస్‌ రాజీపడదన్నారు. ఓట్ల రాజకీయం మాకు అవసరంలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కి రాయండి మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు జగదీష్ రెడ్డి.

యాసంగి సాయం అందకముందే వానకాలం సీజన్ మొదలైంది. రైతుభరోసా పై రేవంత్ ప్రమాణం చేయాలన్నారు జగదీష్ రెడ్డి. ఇచ్చే ఉద్దేశం లేక.. కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధును ఎప్పుడు తాము ఆపమనలేదని స్పష్టం చేశారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతుబంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదన్నారు. రైతులకు ఇదే చివరి రైతుబంధులా కనపడుతోందని తెలిపారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కి మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందని తెలిపారు. గోదావరి జలాలు తమిళనాడుకు పంచే కుట్ర జరుగుతుందన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. తడిసిన ధాన్యం మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని  జగదీష్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఐకేపీల్లో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం కారణంగానే అకాల వర్షాలతో పంట నష్టం జరుగుతోందన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లే

Latest News

More Articles