Sunday, May 19, 2024

కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్‌పై కేసు న‌మోదు

spot_img

కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్‌ జిల్లాలో కేసు నమోదైంది. ఆదిలాబాద్ సభలో దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈనెల 5వ తేదీన నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు, సీతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని.. మీరు ఏవిధంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు. రాముడు మీకు చిన్నాయన, సీత చిన్నమ్మన అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదులో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇది కూడా చదవండి: క్రిశాంక్ ఇష్యూ..రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్.!

Latest News

More Articles