Monday, May 20, 2024

విద్యార్ధుల‌కు గుడ్ న్యూస్… వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ విడుదల చేసిన అమెరికా

spot_img

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులకు..అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేశాయి. USA యూనివ‌ర్శిటీల్లో అడ్మిషన్లకు అనుగుణంగా అమెరికా ప్రభుత్వం ఈనెల 31వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్స్‌ను ఇవాళ‌(బుధవారం) విడుదల చేసింది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి భారీగా స్లాట్లు అందుబాటులోకి తేవాలని అమెరికా అనుకుంటోంది.

దశలవారీగా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అమెరికా కాన్సులేట్ అధికార ప్రతినిధి తెలిపారు. జూన్ నెల స్లాట్లు ఈ నెల మూడో వారంలో.. ఆ తర్వాత జులై, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. వీసా జారీలో భాగంగా మొదట విద్యార్థుల ఫింగర్ ఫ్రింట్స్ తీసుకుని..ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్ల జారీ చేయ‌నున్నారు.

ఇది కూడా చదవండి: క్రిశాంక్ ఇష్యూ..రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్.!

Latest News

More Articles