Sunday, May 19, 2024

రైతులకు కరెంట్ బిల్లు సీఎం కేసీఆర్ కడుతున్నారు

spot_img

సిద్దిపేట జిల్లా తిమ్మయి పల్లి గ్రామంలో 40లక్షల తో పంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. తిమ్మాయి పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామన్నారు. నాడు తిమ్మాయిపల్లి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది..నేడు ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు మంత్రి. నంగునూరు మండలం భాషాయి గూడెంలో గ్రామ మహిళా మండలి భవనం, యూత్ భవనానికి ఇవాళ(శనివారం) మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.  ఆ తర్వాత మాట్లాడిన ఆయన.. గ్రామంలో పత్రి గల్లీలో సిసి రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలిపోయే మీటర్లు, ఎండిన పొలాలు ఉండేవి. రైతులకు కరెంట్ బిల్లు సీఎం కేసీఆర్ కడుతున్నారు. యాసంగి లో ఇంత పంట పండింది అంటే అది కేసీఆర్ పుణ్యమే. కాళేశ్వరం నిర్మాణం చేశాం కాబాట్టే ఇంత పంటపండుతోంది. ఒక్క గింజ లేకుంటా కొని రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. పక్క రాష్ట్రంలో వరి ధాన్యం కొనడం లేదు. అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అర్ధరాత్రి కరెంటు వచ్చేది..మోటార్లు కాలేటివని తెలిపారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ నాయకులు గొప్పగా మాట్లాడుతున్నారు. తిమ్మాయిపల్లి కి రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది.. తెలంగాణ రాకముందు పల్లెలు ఎట్లా ఉండేవని అన్నారు. తెలంగాణ వచ్చాక ఆకుపచ్చ పల్లెలుగా మారాయన్నారు. ప్రజలు మరవద్దు తిన్నరేవు తలవాలన్నారు. రాళ్ల వర్షానికి పంట నష్టం జరిగిందన్న మంత్రి.. రైతులు వానాకాలం పంటలు ఒక్కనెల ముందు పెట్టుకోవాలని సూచించారు. కాలం కాకున్నా నీళ్లు వచ్చాయి.. రైతులకు పెట్టుబడి వచ్చిందన్నారు. రైతులు ఆయిల్ పామ్ పంటలు పెట్టుకోవాలని తెలిపారు. నేను పామ్ ఆయిల్ పెట్టిన..మీరు పెట్టుకోండని రైతులకు చెప్పారు.

రైతులు పంట మార్పిడి చేయాలి..అప్పుడే పంటలు రోగాల బారిన పడకుండా ఉంటాయన్నారు మంత్రి హరీశ్ రావు.అంతేకాదు.. పంటలకు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. రైతులు పంట దిగుబడి కోసం జీలుగు,జనుము వాడాలన్నారు. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టొద్దని.. వరి కొయ్యలకు నిప్పు పెడుతే భూమి బలం తగ్గుతుందని తెలిపారి మంత్రి హరీశ్ రావు.

Latest News

More Articles