Saturday, June 22, 2024

ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ మనదే

spot_img

సిడబ్ల్యుసి మీటింగ్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు చేస్తుంది ఎవరన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలను గ్యారంటీల పేరిట మోసం చేయడం కుదరదని..తెలంగాణకు పర్మినెంటు గ్యారంటీ కేసీఆర్ మాత్రమే అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణకు ఈ రోజు అమిత్ షా వచ్చి తిడుతారు, రేపు ఖర్గే వచ్చి తిడుతారు అని చెప్పుకొచ్చారు.ఈరోజు తెలంగాణ భారతదేశానికి దిక్సుచిగా మారిందని, దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ ఎన్నో అవార్డులు సాధించింది అని, ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ లను దాటి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందని మంత్రి హరీష్‌ రావు చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తే.. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందన్నారు మంత్రి. దేశ వైద్య అవసరాలు తీర్చేందుకు వేల మంది డాక్టర్లును తయారు చేస్తున్నామన్న మంత్రి హరీష్‌ రావు.. కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పి చెవిలో పువ్వులు పెడతారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసేందేమి లేదన్న మంత్రి.. కాంగ్రెస్ పార్టీవి అన్ని వట్టి మాటలే అని… కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.

Latest News

More Articles