Sunday, May 19, 2024

కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలు, కర్ప్యూలు

spot_img

కాంగ్రెస్ అంటేనే గ్రూప్ లు.. మూటలు, ముఠాలు, మాటలు, మంటలు అని అన్నారు మంత్రి హరీశ్ రావు. టిక్కెట్లు ఇవ్వకముందే తన్నుకుంటున్నారని అన్నారు. జనగామ జిల్లాలోని జనగామ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బస్వరాజు సారయ్య. కార్యక్రమంలో మాట్లాడారు మంత్రి హరీశ్ రావు.కాంగ్రెస్ పాలన అంటే కరెంట్ కష్టాలు, కర్ప్యూలు. కాంగ్రెస్ కు మళ్ళీ అవకాశం ఇస్తే పాతాలలోకంలోకి పోతాం.సీఎం కేసీఆర్ అంటే నమ్మకం. బ్రహ్మాండమైన మేనిఫెస్టో 15వ తేదీన ఇస్తున్నాం.16న సీఎం కేసీఆర్ జనగామకు వస్తున్నారన్న మంత్రి హరీశ్ రావు..జనగామ విజయం ఖాయం అయిపోయిందన్నారు.

జనగామలో కాంగ్రెస్ కు తల్లితండ్రులకు అన్నం పెట్టనోడు.. ఆరు నెలలకు ఒకసారి కూడా రానోడు ఉన్నాడని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఆకలి అవుతున్నా ఇక్కడ దృశ్యం చూశాక కడుపు నిండిపోయిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి స్వీట్ తినిపించి ఆలింగనం చేసుకుని ఆశీర్వదించడంతో ఊహించని సంతోషం కలిగిందన్నారు. ఏంట్రీ అదిరిపోయింది.. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తామన్నారు.

సీఎం కేసీఆర్ కు జనగామ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ జెండాకు జనగామ అడ్డా అన్నారు. 16న సీఎం కేసీఆర్ జనగామకు వస్తున్నారు. సిద్దిపేటకు, జనగామకే పోటీ.. అభివృద్ధిలో పోటీ పడదామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు.. 11 సార్లు ఇచ్చారు. 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్  అభివృద్ధి చేయలేదు. 11 ఏళ్లు కాక ముందే సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ది చేసి చూపించారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 2009 కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి.. ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. మేము మేనిఫెస్టోలో పెట్టని పనులు చేశాం..కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ లాంటి అనేక పథకాలు మేనిఫెస్టోలో లేవన్నారు. మన నాయకుడు ఓట్ల కోసం చేసే నాయకుడు కాదన్నారు మంత్రి హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్, బీజేపీ లను నమ్మి మోసపోవద్దు

 

Latest News

More Articles