Sunday, May 19, 2024

రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పిస్తాం

spot_img

కేసీఆర్ వచ్చాక తాటిచెట్టుకి పన్ను రద్దు చేశారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డిలో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్ రాబోయే రోజుల్లో గీతా కార్మికులకు లునాలు ఇప్పించే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. అతేకాదు.. కల్లు ఆరోగ్యానికి మంచిది అంటూ ప్రచారం చేస్తున్నామన్నారు. ఎవరు అడగక ముందే 15 శాతం రిజ్వేషన్లను వైన్ షాపులో ఇచ్చామని తెలిపారు.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెలిచి హైదరాబాద్‌లో నే ఉన్నారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఓడిపోయిన చింతా ప్రభాకర్ జనాలతోనే ఉన్నాడని అన్నారు. ఈ ఐదేళ్లలో జగ్గారెడ్డి ఒక్క ఊరు కూడా తిరగలేదని విమర్శించారు. మూడు కోట్ల రూపాయలతో ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం పెడుతున్నామన్నారు. గౌడల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందన్నారు. శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్‌లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పని చేసే వారిని దీవించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి.

ఇది కూడా చదవండి: రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు

Latest News

More Articles