Sunday, May 19, 2024

నెలలోపు రూ.లక్ష రుణమాఫీ.. మంత్రి హరీష్ రావు

spot_img

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు మీడియాతో ముచ్చటిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు. ‘ 30ఏళ్లగా నిండని ఇబ్రహీంనగర్ పెద్ద చెరువు కాళేశ్వరం నీళ్లతో నిండింది. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఎప్పుడు వచ్చేదో తెలియదు. మూడు గంటల కరెంట్ ఇచ్చేవాడు కావాలో, 24గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలో ప్రజలే చెప్పాలి. కాంగ్రెస్ పాలించే రాష్ట్రలో 24గంటల విద్యుత్, రైతు బంధు, రైతుబిమా ఎందుకు ఇస్తున్నారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఢిల్లీ కరెంట్ కోతలు ఉన్నాయి.

తెలంగాణ పల్లెలు వెలుగులు జిల్లుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రైతులకు భరోసా దొరికింది. ఒక్కరాష్టల ముఖ్యమంత్రు బియ్యం కావాలని సియం కేసీఆర్ ను అడుగుతున్నారు. నాడు తెలంగాణలో కైకిల్ దొరకలేదు, నేడు కైకిలోళ్లు దొరకడం లేదు. నెలలోపు రైతులందరికీ లక్షా రూపాల రుణమాపి చేస్తాము. కేసీఆర్ ఇచ్చిన మాట ఎన్నడూ తప్పలేదు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. తెలంగాణ కోసం నేను రాజీనామా చేశాను, నన్ను మీరు ఆశీర్వదించారు. ఇక 15 రోజులైతే కాంగ్రెస్, బిజెపి నాయకులు బయలుదేరుతారు. మీకు ఎప్పుడు అండగా ఉండేవారు ఎవరో మిరే ఆలోచన చెయ్యాలి’ అని అన్నారు హరీష్ రావు.

Latest News

More Articles