Saturday, May 18, 2024

మోదీ చెప్పేవన్నీ టీమిండియా.. చేసేవి మాత్రం తొడో ఇండియా

spot_img

మెదక్ జిల్లా: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు పాల్గొన్నారు.  అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయని, అమరుల త్యాగాలను,9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి స్మరించుపోవాల్సిన అవసరం ఉందన్నారు.

‘‘జూన్ 2 మనకు స్వాతంత్ర దినం లాంటింది. సమైక్య రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శం. తెలంగాణ ఆచరిస్తున్నది… దేశం అనుసరిస్తుంది. అన్ని వర్గాలు ప్రగతి పథంలో ఉన్నాయి. కాంగ్రెస్, బిజెపి లకు ఉత్సవాలు జరపడం మింగుడుపడటం లేదు. ఉద్యమంలో నాడు రెండు పార్టీలు కలిసి రాలేదు..  నేడు ఉత్సవాలకు రావడం లేదు. అమరుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేస్తోంది. బిజెపి వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు… కానీ ఉద్యమంలో రాజీనామా కు ఆయన భయపడ్డాడు.

తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని ఉత్సవాలు చేస్తారా. ఉత్సవాలు జరిపే నైతికత బిజెపికి ఉందా. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ లు సిఫారసులు చేసినా కేంద్రం ఏనాడు పట్టించుకోలేదు. విభజన సమస్యల పరిష్కారం లో కేంద్రం విఫలమైంది. కృష్ణా జలాల వాటా తేల్చరు… స్వయంగా సీఎం కేసీఆర్ లేఖలు రాసినా స్పందన లేదు. రాష్ట్రానికి రావాల్సిన  1350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ఫ్యాకేజీ లు ఇస్తున్నారు.. కానీ ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదు.

రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే అమరులను అవమానించడమే. నీతీ ఆయోగ్ కు ఇజ్జత్ ఉందా… కేంద్రం ఏనాడైన విలువ ఇచ్చారా. మోదీ గారిలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింది. నితీ ఆయోగ్ మిషన్ భగీరథ కు 20 వేల కోట్లు ఇవ్వాలని చెబితే కనీసం 20 పైసలు ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సమావేశాలకు గతంలో ఎన్నో సార్లు కెసిఆర్ హాజరయ్యారు. రాష్ట్ర అప్పుల గురించి కాదు… కేంద్రం చేసిన అప్పుల సంగతి ముందు చెప్పండి. రాష్ట్రం పరిమితికి లోబడి అప్పులు చేశాము….కేంద్రం ఎప్పుడో పరిమితి దాటింది.

పార్లమెంట్ కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారు. కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టమని బి అర్ ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.ఇప్పటికైనా పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి. రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థ లకు తేడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు. మోదీ చెప్పేవన్నీ టీమిండియా… చేసేవి మాత్రం తొడో ఇండియా.’’ అని మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

Latest News

More Articles