Sunday, May 5, 2024

అఖిల భారత రైతు సంఘాల సమావేశం.. తెలంగాణ వ్యవసాయ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని తీర్మానం

spot_img

హైదరాబాద్: తమిళనాడులో రెండు రోజుల పాటు జరిగే అఖిల భారత రైతు సంఘాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో CIFA అధ్యక్షుడు వసంత్ పాటిల్, దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకుడు కోటపాటి నర్సింహ రావు తోపాటు పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో రైతుల స్థితిగతులపై చర్చ జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు దేశవ్యాప్తంగా అమలుకు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి చట్టం అమల చేయాలన్నారు. ఎంఎస్పి చట్టాన్ని అమలు కొరకు ప్రస్తుతం ఉన్న CACP కమిటీ ఉన్న రైతులకు న్యాయం జరగడం లేదని నేతలు స్పష్టం చేశారు.

CACP ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని,అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నప్పుడు ఎగుమతులు బ్యాన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సీఎం కేసీఆర్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రంగంకు నిరంతర విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు తీరును అభినందిస్తూ మరో తీర్మానం చేశారు.

ఎంఎస్పి సమర్థవంతంగా అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని సమావేశంలో రైతు నేతలు కొనియాడారు. రైతు సమస్యలను వెంటనే పరిస్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలపై విస్తృతంగా చర్చ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles