Friday, May 17, 2024

నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

spot_img

తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని,నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు మంత్రి జగదీశ్ రెడ్డి. నాగార్జున సాగర్ వివాదంపై సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి…సాగర్ నీటి విషయంలో మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో కృష్ణా నీటి సమస్య కొనసాగుతోందన్నారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాలలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందన్నారు మంత్రి. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తోండి చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర వాట నుండి ఒక్క చుక్క కూడా పోనీయం అని తెగేసి చెప్పారు. సాగు తాగు నీటి కోసం మేమంతా సాగర్ పై ఆధారపడి ఉన్నామని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి.

కోట్లాది మంది ప్రజల జీవితాలతో చేలాగాటమాడే పద్దతిలో ఆంధ్ర వ్యవహారం.సరైందికాదన్న మంత్రి ఆంధ్ర తీరు సహించబోమన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం మా హక్కుల్ని హరించడం ఎవరివల్ల కాదన్నారు. నీటి వివాదం అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు మాకు లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: నాగార్జున సాగర్‌ వద్ద ఉద్రిక్తత.. ఏపీ పోలీసుల దౌర్జన్యం..!

Latest News

More Articles