Friday, May 17, 2024

దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దు

spot_img

తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ….తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసినట్లుగా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయని, అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే.. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తర్వాతే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించినట్లు పలు ఛానళ్లు ప్రచారం చేశాయి..

అంతేకాకుండా.. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని మంత్రి కేటీఆర్ అన్నట్లుగా. అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయని.. లేదంటే కష్టమే.. ఏప్రిల్ లేదా మే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగొచ్చని కేటీఆర్‌ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, 65 సంవత్సరాల లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మెడికల్ కాలేజీలే అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles