Thursday, May 2, 2024

బార్ వెయిట‌ర్ నుంచి ఇన్‌స్టాగ్రాం హెడ్‌ గా ఆడం మొస్సేరి కెరీర్‌

spot_img

ఇన్‌స్టాగ్రాం హెడ్ ఆడం మొస్సేరి కెరీర్ స్ఫూర్తిదాయ‌కంగా సాగుతూ యువ‌తలో స్ఫూర్తి నింపుతోంది. మెటా సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫ్లాం ఇన్‌స్టాగ్రాం చీఫ్‌గా మొస్సేరి 2018 నుంచి కీల‌క బాధ్య‌త‌లు చేప‌డుతున్నాడు. మొస్సేరి ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్‌ గానూ సేవ‌లందించ‌గా తాజాగా థ్రెడ్స్ నూ ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. మొస్సేరి అతిపెద్ద సోష‌ల్ మీడియా ప్లాట్‌ ఫాంను అవ‌లీల‌గా నిర్వ‌హిస్తున్నా టెక్ ప్రొఫెష‌న‌ల్‌గా ఇన్‌స్టాగ్రాం చీఫ్‌గా అత‌డి ప్ర‌స్థానం సాఫీగా సాగ‌లేదు. మొస్సేరి థ్రెడ్స్ రీసెంట్ పోస్టుల్లో త‌న కెరీర్ ప్ర‌యాణంలో సాగించిన టాప్ ఫైవ్ రోల్స్ ను తెలిపారు.

మొస్సేరి మొదట వెయిట‌ర్‌, బార్ టెండ‌ర్‌గా త‌న కెరీర్ ప్రారంభించాడు. ప‌లు రెస్టారెంట్ జాబ్స్ లో అనుభ‌వం సంపాదించిన త‌ర్వాత మొస్సేరి త‌న కెరీర్‌ను డిజైన‌ర్‌, మేనేజ‌ర్ రోల్‌కు చేంజ్ అయ్యాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన మొస్సేరి ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రాం ప్రోడ‌క్ట్ హెడ్ పొజిష‌న్‌కు చేరుకున్నాడు. మొస్సేరి 2002లో బ్లాంక్ మొస్సేరి పేరుతో డిజైన్ కంపెనీని లాంఛ్ చేశాడు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని అకాడ‌మీ ఆఫ్ ఆర్ట్స్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా సేవ‌లందించాడు. 2007లో మౌలిక‌స‌దుపాయాలు, ఏపీఐ, టూల్స్‌కు సంబంధించిన టాక్స్ బాక్స్ లో చేరాడు. 2008లో ఫేస్‌ బుక్ ప్రోడ‌క్ట్ మేనేజ‌ర్‌గా మొస్సేరి కెరీర్ మ‌లుపు తీసుకుంది. మెటాలో క్ర‌మంగా ఎదుగుతూ 2018 నుంచి ఇన్‌స్టాగ్రాం హెడ్‌గా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు.

Latest News

More Articles