Friday, May 17, 2024

మేమున్నాం అధైర్యపడకండి.. రైతులకి కేటీఆర్ భరోసా..!

spot_img

సిరిసిల్లలో అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. మంగళవారం ముస్తాబాద్‌ మండలం గోపాలపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడంతో పాటు ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా, వీర్నపల్లిలోని పొలాల్లో దెబ్బతిన్న వరిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతులను మంత్రి పరామర్శించి, రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉందని, బాధిత రైతులకు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని కోరుతూ, రైతు సమాజం కూడా ఆశలు వదులుకోవద్దని అభ్యర్థించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచి నష్టపోయిన పంటతో పాటు, పొలాల్లో దెబ్బతిన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, లావాణి పట్టా ఉన్న రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు.

అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నప్రస్తుత పరిస్థితికి ఎవరూ బాధ్యులు కారని విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా నీరు, విద్యుత్, ఎరువులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ వర్షాలు కురవకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles