Friday, May 3, 2024

త్వరలోనే మరో 40 వేల ఇండ్లు పంపిణీ

spot_img

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవుతో అంబర్ పెట్ లోని ముసరాం బ్రిడ్జి నిర్మించనున్న బ్రిడ్జికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, మహమూద్ ఆలీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read.. మెదక్ జిల్లాలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు మృతి

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మూసా,ఈసా పై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. 2020 లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయి. కరోనా వలన కొన్ని పనులు ఆలస్యం అయిన మాట వాస్తవం. ఇప్పుడు అన్నింటినీ చేస్తున్నాము. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలి అని ఎస్టీపిలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

Also Read.. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు..

దుర్గం చెరువు పై నిర్మించిన బ్రిడ్జి కంటే అందమైన బ్రిడ్జిలను నిర్మిస్తాం. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాము. తొమ్మిది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధిని సాధించాము. గణేష్ నిమ్మజ్జనం కోసం మం ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ ర్యాలినీ రెండురోజులు వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే 30 వేల డబుల్ బెడ్ రూం లను పంపిణీ చేసుకున్నాము. త్వరలోనే మరో 40 వేల ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు.

Latest News

More Articles