Friday, May 3, 2024

కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చినట్లు కామారెడ్డికి కేసీఆర్ వస్తుండు

spot_img

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. అధికార బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. జిల్లాలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్‎కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీలో తీశారు. అందులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గతంలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉండేవో ప్రజలు ఆలోచించాలి. గతంలో ఇంత వరి ధాన్యం పండుతుండేనా. గతంలో రెండుసార్లు గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకున్నాం. గతంలో ఎవరూ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. మళ్ళీ వచ్చేది, పెన్షన్‎లు ఇచ్చేది కేసీఆర్ మాత్రమే. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొచ్చిన చందంగా కామారెడ్డికి కేసీఆర్ వస్తుండు. మోడీ పెంచిన సిలిండర్ ధరను కేసీఆర్ తగ్గిస్తుండు. మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాకా రూ. 5 వేలు పెన్షన్ ఇస్తాడు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తాం. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ రూ. 3 వేల పెన్షన్ ఇస్తాం. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత భీమా కల్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేసి మళ్ళీ పట్వారీ వ్యవస్థ తెస్తానని అంటున్నారు. మనకు మూడు గంటల కరెంట్ కావాలా? పట్వారీ వ్యవస్థ కావాలో ఆలోచించాలి. మనకు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కామారెడ్డి వస్తే ఇక్కడి రూపురేఖలు మారుతాయి. ఈ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్‎ను గెలిపించాలి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles