Friday, May 3, 2024

సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నాగచైతన్య

spot_img

టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ను ప్రారంభించాడు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తో పాటు యూట్యూబ్‌ ద్వారా  ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చైతూ చేరాడు. ‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ తెలిపాడు.

ఇది కూడా చదవండి:కష్టసుఖాల్లో ప్రజలతో ఉండేది సీఎం కేసీఆర్ మాత్రమే

Latest News

More Articles