Wednesday, May 15, 2024

మనసుతో అలోచించి ఓటు వేయాలి

spot_img

మహబూబాబాద్ జిల్లా : మనసుతో అలోచించి ప్రజలు ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తొమ్మిదిన్నర ఏళ్ల కిందట ఎట్లున్నది? ఇవ్వాళ ఎట్లున్నది? సంక్షేమం, అభివృద్ధి, సాగు నీరు, తాగు నీరు ఏ విధంగా ఉన్నాయి? ఆలోచించాలి. దేశంలో రెండున్నర శాతం జనాభా ఉన్న రాష్ట్రం 30 శాతం అవార్డులు తెచ్చుకుంటున్నది. ఇదంతా ఉత్తిత్తిగా వస్తుందా? సీఎం కెసిఆర్ డైరెక్షన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృషితో తెలంగాణ ఇదంతా సాధించిందని కేటీఆర్ అన్నారు. తొర్రూరులో జరిగిన పాలకుర్తి నియోజకవర్గం సంక్షేమ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేటీఆర్ మాట్లాడారు.

Also Read.. 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డులను తిరగరాస్తం

‘‘ఒకప్పుడు ఒక గంగాదేవిపల్లి మాత్రమే ఆదర్శ గ్రామంగా ఉంటే.. ఇవ్వాళ రాష్ట్రంలో గ్రామాలన్నీ ఆదర్శంగా మారాయి. గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కలిగాయి. ఒకప్పుడు కరెంటు వస్తే వార్త, ఇవ్వాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తుంటే.. ఒక అనుమానపు పక్షి, ఎంపీ ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న.పాలకుర్తిలో కరెంటు వైర్లు పట్టుకోండి.. కరెంటు ఎట్లుందో తెలుస్తుంది. తెలంగాణకు పట్టిన పీడ పోతుంది.

Also Read.. ఈనెల15న పార్టీ మేనిఫెస్టో విడుదల.. నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్

నాడు ఎంత ఘోరంగా పరిస్థితులు ఉండే.. ఇవ్వాళ ఎట్లున్నది. ఇంటింటికి నీళ్ళు ఇస్తా, ఇవ్వకపోతే ఓట్లు అడగను అనే దమ్ము ఎవరికి ఉంది? ఒక్క కేసీఆర్ కు తప్ప. మంచినీళ్లు ఇవ్వాలని, సాగు నీరు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్ల లాగా వస్తున్నారు. రూపాయలు సరిపోతలేవని, డాలర్లతో వస్తున్నారు. దయాకర్ రావు కావాలా? చుట్టపు చూపుగా వచ్చే అమెరికా వాళ్ళు కావాలా? తేల్చుకోండి. ఇస్తే వద్దనకుండా మంచిగా తీసుకోండి… ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి.’’ అని కేటీఆర్ కోరారు.

Latest News

More Articles