Monday, April 29, 2024

రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్తున్నారా?

spot_img

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో నగదు పంపిణీతోపాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా ప్రారంభమైంది. నగదు, బంగారం ఇతర వస్తువులను తరలిస్తూ.. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్‌ చేస్తారు. తెలంగాణలో దాదాపు 148 చెక్‌పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. రూ.50వేల వరకే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Also Read.. ఈనెల15న పార్టీ మేనిఫెస్టో విడుదల.. నవంబర్ 9న సిఎం కేసీఆర్ నామినేషన్

ఒకవేళ రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి. ఆసుపత్రిలో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలి. బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా తమవద్ద పెట్టుకోవాలి.

Also Read.. తమిళనాడులో అగ్నిప్రమాదం..9మంది దుర్మరణం

వస్తువులు, ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి. భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపాల్సి ఉంటుంది. వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను ఆధారాలతో అధికారులకు చూపించాలని అధికారులు తెలిపారు.

Latest News

More Articles