Wednesday, May 22, 2024

నాటుకోడి, బగార వండిన మంత్రి కేటీఆర్‌.. వైరల్‌ అవుతున్న వీడియో

spot_img

నిత్యం ఏదో కార్యక్రమంలో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ గరిటె పట్టాడు. అంతేనా… నాటుకోడి కూర, బగార వండి ఔరా అనిపించాడు. శనివారం ఆయన యూ ట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ మరియు ఆమె బృందంతో కలిసి ఓ వీడియో చేశారు.

నిరుడు కరీంనగర్‌లో కళోత్సవాలకు హాజరైన కేటీఆర్‌ను గంగవ్వ బృందం కలిసి తమతోపాటు ఓ వీడియో షోలో పాల్గొనాలని కోరారు. ఆ హామీ మేరకు శనివారం వీడియో షోలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. గంగవ్వ బృందం సభ్యులతో ముచ్చట పెడుతూనే నాటు కోడి కూర, బగార అన్నం వండారు.

ఈ సందర్భంగా ఆ బృందం అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన విద్యాభ్యాసం, బాల్యం, ఇతర కుటుంబ విషయాలను మంత్రి కేటీఆర్‌ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని, రాబోయే రోజుల్లో అమలు చేయనున్న కార్యక్రమాలనూ వివరించారు. అనంతరం బృందం సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం గంగవ్వ మంత్రి కేటీఆర్‌కు కొత్త బట్టలు పెట్టి విజయతిలకం దిద్దారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షోలో పాల్గొనడం చాలా మంచిగా అనింపించిందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

Latest News

More Articles