Friday, May 17, 2024

16 రోజులు.. 54 సభలు: సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్

spot_img

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాజాగా రాబోయే 16 రోజులకు సంబంధించి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 13 నుంచి 28 వరకు 54 సభల్లో పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

Also Read.. కేసీఆర్ సింహం లాంటోడు.. సింగల్ గా వస్తడు.. కేటీఆర్ కిర్రాక్ స్పీచ్

ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ పాల్గొనున్నారు. సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ 28న సభతో ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్:

  • 13న దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌.
  • 14న పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.
  • 15న బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌.
  • 16న ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌.
  • 17న కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల.
  • 18న చేర్యాల.
  • 19న అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి.
  • 20న మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ.
  • 21న మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట.
  • 22న తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి.
  • 23న మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు.
  • 24న మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి,
  • 25న హైదరాబాద్‌లో భారాస ప్రజా ఆశీర్వాదసభ.
  • 26న ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.
  • 27న షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి.
  • 28న వరంగల్‌ (ఈస్ట్‌, వెస్ట్‌), గజ్వేల్‌.

Latest News

More Articles