Sunday, May 19, 2024

బీఆర్ఎస్‌లో పొన్నాల చేరికపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్

spot_img

కేసీఆర్ వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తార‌ని కేటీఆర్ తెలిపారు. తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్ పలు కీలక అంశాలపై స్పందించారు. రాహుల్ గాంధీ లీడ‌ర్ కాదు.. రీడ‌ర్ అని కేటీఆర్ విమ‌ర్శించారు. పొన్నాల ల‌క్ష్మ‌య్య బీఆర్ఎస్‌లో చేరుతానంటే రేపే వెళ్లి ఆహ్వానిస్తాను. త్వ‌ర‌లో చాలా మంది ప్ర‌ముఖులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత గాంధీ భ‌వ‌న్‌లో త‌న్నుకుంటారు. కాంగ్రెస్‌లో సీఎం ప‌ద‌వికి ఇద్ద‌రి మ‌ధ్య అంగీకారం కుదిరిన‌ట్టు స‌మాచారం ఉంద‌న్నారు కేటీఆర్.

ఇక జీహెచ్ఎంసీ, సిరిసిల్ల‌, కామారెడ్డిలో నేను ప్ర‌చారం చేస్తాను. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈసీ స్వ‌తంత్రంగా ప‌ని చేస్తుంద‌ని భావిస్తున్నా. అధికారుల బ‌దిలీల‌ను సాధార‌ణ బ‌దిలీలుగానే చూస్తాం. హుజురాబాద్‌లో కూడా మేమే గెలుస్తాం. ఇక ఈట‌ల రాజేంద‌ర్ 50 చోట్ల పోటీ చేసినా, ష‌ర్మిల 119 సీట్ల‌లో పోటీ చేసినా అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Latest News

More Articles