Sunday, May 12, 2024

ఐటీ టవర్ గా మలక్ పేట్

spot_img

హైదరాబాద్ మలక్ పేట్ లో ఇవాళ(సోమవారం) మంత్రి కేటీఆర్  ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి భూమి పూజా చేశారు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల వ్యయంతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ ను నిర్మిస్తున్నారు. భూమి పూజ తర్వాత మాట్లాడిన మంత్రి కేటీఆర్…36 నెలల్లోనే ఐటి టవర్ నిర్మాణం పూర్తి చేస్తాం. మైక్రోసాఫ్ట్, ఆడోబ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తాం. గతంలో ఏ పండుగ వచ్చినా కూడా కర్ఫ్యూ పెట్టే వాళ్ళు. గత 10 ఏండ్లలో హైదరాబాదులో ఏ రోజు కర్ఫ్యూ విధించలేదు. 44.20 ఎకరాల్లో ఐటీ టవర్‌ను నిర్మిస్తాం. తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్ల ఖర్చుతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నాం. ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుందన్నారు.

ఇది కూడా చదవండి:దసరాకు 5,265 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేవు

మెట్రోను హైదరాబాద్ నలువైపులా విస్తరిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. చిన్నప్పుడు మలక్ పేట్ అంటే టీవీ టవర్ అని వాళ్ళు..రాబోయో రోజుల్లో మలక్ పేట్ అంటే ఐటీ టవర్ అంటారన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్.. కేసీఆర్ చేతిలో ఉంది. MIM  అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఉంటే..BJP స్టీరింగ్ మాత్రం ఆదాని చేతిలో ఉందన్నారు మంత్రి కేటీఆర్.

ఎన్నికల టికెట్ ఇస్తానంటూ రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు తీసున్నాడు

 

Latest News

More Articles