Saturday, May 18, 2024

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం

spot_img

విద్యార్థులకు.. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలన్నారు మంత్రి కేటీఆర్ . రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో 8.5 కోట్లతో అభివృద్ది చేసిన పాఠశాల సముదాయ భవనాలను కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి..అమెరికాలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు కలుస్తుంటారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ ఫలితాలు అని తెలిపారు. అమెరికా లో కూడా పేదలు ఉన్నారు…ఉన్నంతలో ఎంత చేశామో ఆలోచించండని అన్నారు మంత్రి కేటీఆర్. అంతేకాదు.. విద్యతోనే వికాసం, ఆత్మవిశ్వాసం. ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల కచ్చితంగా వస్తుంది. 9 ఎండ్ల కింద విద్యా, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాలు ఎంట్లుండే… ఇప్పుడు ఎట్లుంది బేరీజు వేసుకోవాలన్నారు.

6 రోజుల క్రితం ఎల్లారెడ్డి పేటలో వేణుగోపాల స్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశాం. సంవత్సరన్నర లో పూర్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. తండాలు GP లుగా చేశామన్న మంత్రి కేటీఆర్..ఎవరి వల్ల రాష్ట్రం బాగవుతుందో ఆలోచించాలన్నారు. ఎల్లారెడ్డి పేట కు బారాబర్ డిగ్రీ కళాశాల ను సీఎం కేసీఆర్ సరైన సమయంలో మంజూరు చేస్తారన్నారు. పలకతో వచ్చి పట్టా తో..వెళ్లాలనే గంభిరావు పేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ఏర్పాటు చేశామన్నారు. సిరిసిల్ల ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోనే ముందుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  చదివే ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ పై శిక్షణ ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles