Saturday, May 4, 2024

సీఎం కేసీఆర్ వల్లే ప్రభుత్వ పాఠశాలల గేట్లకు హౌస్ ఫుల్ బోర్డులు

spot_img

‘మన ఊరు – మన బడి’తో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రూ. 2 కోట్ల 80 లక్షలతో నూతనంగా నిర్మించిన కస్తూర్భా గాంధీ పాఠశాల భవనాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. ‘మన ఊరు – మన బడితో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమే. విద్యార్థులకు నాణ్యమైన ఉచిత భోజనం, పుస్తకాలు, బట్టలు అందిస్తున్న మహనీయుడు సీఎం కేసీఆర్. తెలంగాణలోని గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం వేల కోట్లు కేటాయిస్తున్నాం. గతంలో విద్యార్థులు లేక సర్కారు బడులు వెలవెలబోయాయి. నేడు గేట్లకు హౌస్ ఫుల్, మా బడిలో సీట్లు లేవు అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యతోనే బంగారు భవిష్యత్తు అని నమ్మి సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారు’ అని అన్నారు.

Latest News

More Articles