Wednesday, May 8, 2024

57 ఏండ్ల‌లో గుడిని, బ‌డిని ప‌ట్టించుకోలేదు.. ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజం..!

spot_img

ఎవ‌డో వ‌చ్చి నాలుగు స్పీచ్‌లు కొట్టంగానే, ఊద‌ర‌గొట్టే ఉప‌న్యాసాలు ఇవ్వ‌గానే ఆగ‌మాగం మాటలు మాట్లాడ‌గానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవ‌రి వ‌ల్ల బాగు ప‌డుతుందో ఆలోచించాలి అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. 57 ఏండ్ల‌లో గుడిని, బ‌డిని ప‌ట్టించుకోలేదు.. సాగునీటి గోస తీర్చ‌లేదు కానీ.. ఇప్పుడు వ‌చ్చి ఏదేదో మాట్లాడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌పై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

ఎల్లారెడ్డిపేటలో రూ. 8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మా కంటే ముందున్న ప్ర‌భుత్వాలు ఏం చేశాయి..? ఒక బ‌డిని బాగు చేద్దామ‌న్న ఆలోచ‌న లేదు.. కానీ ఇప్పుడొచ్చి పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు.

బ‌డిని, గుడిని ప‌ట్టించుకోలేదు. క‌రెంట్, సాగు నీళ్లు ఇవ్వ‌లేదు. ఎవ‌డో చెప్పిండ‌ని కాదు.. మ‌న ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌ని చేయాలి. అయిన ప‌నుల గురించి మాట్లాడ‌టం లేదు. ఎంపీ బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్‌కు అర పైసానైనా సాయం చేసిండా..? ఒక్క న‌వోద‌య పాఠ‌శాల‌నైనా వ‌చ్చిందా..? క‌స్తూర్బా కాలేజీ వ‌చ్చిందా..? మెడిక‌ల్ కాలేజీ రాదు.. న‌ర్సింగ్ కాలేజీ ఇవ్వ‌రు. మ‌ళ్లీ సిగ్గు లేకుండా డిగ్రీ కాలేజీ ఇవ్వాల‌ని మాట్లాడుతార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Latest News

More Articles