Saturday, May 4, 2024

పేదల పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడమే సీఎం కేసీఆర్ ఆశయం

spot_img

చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుంది, మంచి చెడులు తెలుస్తాయి… మంచి నడవడిక అలవాటవుతుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సమాజం విద్యావంతుల సమాజంగా తయారు కావాలన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవంలో పాల్గొన్నా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ద్రితేష్ వి పాటిల్.  విద్యార్ధిని, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యాశాఖ సిబ్బందికి  “విద్యా దినోత్సవం” సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ .. ఆ తర్వాత మాట్లాడారు. రాష్ట్రంలో గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించడానికే ఈ ఉత్సవాలు. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న. ఆ టైంలో పాఠశాలలో మౌళిక వసతులు లేవు. చెట్ల కింద, గుడిసెల్లో చదువులు కొనసాగేవి. నేటి రోజుల్లో పేదలు మంచి స్కూళ్లలో, కాలేజీలలో చదువుకోవడానికి ఆర్ధిక స్తోమత ఉండదు. పట్టణాలలోని ధనవంతుల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య మారుమూల ప్రాంతాల్లోని పేదల పిల్లలకు కూడా అందాలన్నదే  సీఎం కేసీఆర్ ఆశయం. విద్యావంతుడు, ఆలోచన పరుడైన సీఎం అధికారంలో ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తారు. సీఎం కేసీఆర్ అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 26,065 విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 26 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు స్పీకర్ పోచారం. ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకుంటున్న పిల్లలు అందరూ మన పిల్లల లాంటి వారే. వారి సంరక్షణ మన బాధ్యత అని అన్నారు. ఈ ఏడాది విద్యాశాఖ బడ్జెట్ రూ. 19,093 కోట్లు. కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ప్రజాప్రతినిధులు విద్యాలయాలను నిత్యం సందర్శించాలి… అప్పుడే నాణ్యత పెరుగుతుందన్నారు స్పీకర్. కంప్యూటర్ రంగంలో హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్ధతతో రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు స్పీకర్ పోచారం. దీంతో చదువుకున్న యువతకు ప్రవేటు రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు.

విద్యాలయాలలో మౌళిక వసతులు కల్పించడం మా బాధ్యత, విద్యార్థులకు చదువు  చెప్పి వారిని ప్రయోజకులను చేయడం ఉపాద్యాయులుగా మీ బాధ్యత అని అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. 1994 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒక్కటే జూనియర్ కాలేజి మాత్రమే ఉండేదన్న పోచారం..ఇప్పుడు అన్ని కాలేజీలు కలిపి 30 ఉన్నాయన్నారు. ప్రభుత్వ Bsc నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశామన్నారు.

Latest News

More Articles