Sunday, May 12, 2024

తెలంగాణ లో మార్పు వచ్చింది దేశంలో నంబర్ వన్ గా నిలిచింది

spot_img

హైదరాబాద్ లోని మార్పు సినీనటుడు రజనికి అర్థమైంది ఇక్కడున్న ప్రతిపక్ష గజనిలకు అర్థం కావడం లేదన్నారు మంత్రి కేటీఆర్. 2014 నుండి తెలంగాణ లో మార్పు వచ్చింది దేశంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. నికరంగా మాకు ఆరున్నర సంవత్సరాల సమయం మాత్రమే దొరికింది. 65 ఏళ్ళు ఏలిన నాయకులు చేయని అభివృద్ధి చేసామన్నారు. హైదరాబాద్ మాదాపూర్ HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు మంత్రి కేటీఆర్.

సమగ్ర ,సమీకృత,సమ్మిళిత ,సమతుల్య ,అభివృద్ధి తెలంగాణ మాడల్. వరిదాన్యంలో నంబర్ వన్ గా నిలిచాం. ఒక వైపు ఐటీ మరోవైపు వ్యవసాయం లో గ్రోత్ పెరుగుతుంది. ఈ 25 ఏండ్లలో మనకు ముగ్గురు సీఎం లు గుర్తుకువస్తారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు,రాజశేఖర్ రెడ్డి,కేసీఆర్. ప్రో బిజినెస్, ప్రో అర్బన్, ప్రో ఐటీ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడు, ప్రో రూరల్, ప్రో అగ్రికల్చర్, ప్రో పూర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తే ఆ రెండు కూడా కేసీఆర్‌ లో కనిపిస్తాయన్నారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాలు ప్రజలకు సంబంధం లేని విషయాలపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ మీద మాకు మమకారం ఉన్నది. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ మీద ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వచ్చే టర్మ్ లో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదని ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక కుటుంబానికి సొంత ఇల్లు కల్పిస్తాం. నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.

ఇది కూడా చదవండి: నవంబర్‌ 30 హాలీడే కాదు.. ఓటర్లకు సీఈవో వికాస్‌రాజ్‌ విజ్ఞప్తి

ధరణి లేకముందు లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది కాదని తెలిపారు మంత్రి కేటీఆర్. ధరణి లో కొన్ని చిక్కులు ఉన్నాయి వాటిని కూడా సాల్వ్ చేస్తాం. చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకుందామన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి. బెంగళూరులో ఎం జరుగుతుందో మనం చూస్తున్నాము. ఒకానొక సందర్భంలో సీఎం కేసీఆర్ ఒక్కరోజు 10 జీవోలు ఇచ్చారు.. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇది చేయగలరా ? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. బెంగళూరును తలదన్నే నగరం హైదరాబాద్ వచ్చింది ఇది గర్వంగా చెబుతున్న.

ప్రతి మెట్రో స్టేషన్ చుట్టూ ఏలెట్రిక్ వెహికిల్స్ పెట్టాలని అనుకుంటున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ని మరింత సేఫ్ సిటీగా మార్చుతామన్నారు. సైబర్ ట్రాప్స్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 250 కీమీ మేర తీసుకుపోతాం మొత్తంగా వచ్చే పదేళ్లలో 415 కిమీ మేర మెట్రో విస్తరిస్తాం. రాపిడ్ రైల్ తెచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఏ మూలనున్న గంటలో హైదరాబాద్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టం మరింత మెరుగుపరుస్తాం. వచ్చే టర్మ్ లో టూరిజం మినిష్టర్ కావాలని సీఎం కేసీఆర్ ని అడుగుత హైదరాబాద్ ,తెలంగాణ టూరిజం మరింత అభివృద్ధి చేస్తా అని తెలిపారు. 2036 లో హైదరాబాద్ ని ఒలింపిక్ హోస్ట్ చేసేలా కృషి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో ఇంకా స్టేడియాలు నిర్మించి.. స్పోర్ట్స్ ని మరింత మెరుగుపరుస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.

ఇది కూడా చవదండి: వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను నిజం చేస్తాం

Latest News

More Articles